NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెన్నూరు పెన్నా నదిలో శ్రీశైలం భారీ వరద  నీటి ప్రవాహం

1 min read

చెన్నూరు , న్యూస్ నేడు :  శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటి ప్రవాహంతో జలకల సంతరించుకోవడంతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం జలాశయం నీటిని వదలడంతో నంద్యాల సమీపంలో కుందూ నది ద్వారా దువ్వూరు మండలం రాజోలు ఆనకట్ట మీదుగా వల్లూరు మండలం ఆదనిమ్మాయిపల్లి పెన్నా నది ఆనకట్ట చేరుతూ అక్కడ నుంచి చెన్నూరు మీదుగా సిద్ధవటం సమీపంలో సోమశిల జలాశయంలోకి వరద నీరు ప్రవహిస్తున్నాయి. గత పది రోజులుగా 15వేలు పైబడి క్యూషకులు వరద నీరు ప్రవహిస్తున్నది. పెన్నా నదిపై ఆధునిమాయపల్లి ఆనకట్ట నుంచి 15900 క్యూసెక్కులు వరద నీరు ప్రవహిస్తుండగా కడప చెన్నూరు కేసీ కాలువలకు 230 క్యూసెక్కులు నీటిని అధికారులు వదులుతున్నారు. బుధవారం అది నిమ్మాయిపల్లి ఆనకట్ట వద్ద కేసీ కెనాల్ అధికారులు నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. చెన్నూరు వద్ద చెన్నూరు కొండపేట పెన్నా నది వంతెన పైనుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు ప్రతిరోజు గంటకు ఎన్ని క్యూసెక్కులు వరద నీరు ప్రవహిస్తున్నది సిబ్బంది లెక్కలేస్తున్నారు. గండికోట నుంచి మైలవరం జలాశయానికి నీటిని వదలడంతో మైలవరం జలాశయం అధికారులు పెన్నా నదికి నీటిని వదలడంతో ఆ నీరు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కుందునది ద్వారా వస్తున్న వరద నీరు క్రమేపి పెన్నా నది ద్వారా సోమశిల జలాశయంలోకి చేరుతున్నది. పెన్నా నదిలో వరద నీరు ప్రవహిస్తుండడంతో చెన్నూరు ఒక్కరాయిపల్లి కొండపేట కనుపర్తి బలిసింగపల్లి ఓబులంపల్లి నజీర్వేపల్లి రామనపల్లి గ్రామాల ప్రాంతాల ప్రజలు పెన్నా నది దాటకూడదని మండల తాసిల్దార్ సరస్వతి స్థానిక వీఆర్వోలకు ఆదేశాలు జారీ చేశారు.

About Author