వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యలను జెడిఏ దృష్టికి..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ పి వి సాయికుమార్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి పిఎల్ వరలక్ష్మి ని మర్యాదపూర్వకంగా కర్నూలు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆమె నివాసంలో కలవడం జరిగినది. ఈ సందర్భంగా డీఏఓ కి జెడిఏ గా ప్రమోషన్ వచ్చినందుకు ప్రత్యేక అభినందనలు వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం తరఫున తెలియజేయడమైనది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యలను జెడిఏ కి సవినయంగా తెలియజేయడం జరిగినది, అంతేకాకుండా జేడీఏ దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా చొరవ చూపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సంఘం పక్షాన తెలియజేయడం జరిగినది. జేడీఏ కూడా సవినయంతో అన్ని సమస్యలను నా దృష్టికి వచ్చిన ఏ సమస్యలు అయినా సరే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అధ్యక్షుల వారికి హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ కె రవి ప్రకాష్ , జిల్లా కార్యదర్శి ఎం సి కాశన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేంద్ర, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పి.రమేష్, రాష్ట్ర టైపిస్టు మరియు స్టెనోగ్రాఫర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్, జిల్లా కోశాధికారి నాగ కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు యాసనుల, సంయుక్త కార్యదర్శి ఇలియాస్ భాష, దేవరాజు, మరియు ఇతర వ్యవసాయ శాఖ ఉద్యోగులు సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

