పార్టీ అభివృద్ధికి నా సాయ శక్తుల కృషి చేస్తా.. మండల కో కన్వీనర్
1 min read

హోళగుంద న్యూస్ నేడు: మండల కో కన్వీనర్ గా సుళువాయి గ్రామానికి చెందిన వైసిపినాయకుడు కన్నయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వైసిపి మండల కన్వీనర్ షఫీయుల్ల అన్నారు. గురువారం స్థానిక ఎల్ఎల్సి అతిథి గృహం నందు వైసిపి నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ శ్రేణులు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బూసినే విరుపాక్షి ఆదేశాల మేరకు నూతనంగా హొళగుంద మండల కో కన్వీనర్గా సుళువాయి కన్నయ్యను ఏకగ్రీవంగా ఎను కోవడం జరిగింది అన్నారు. నూతనంగా కో కన్వీనర్ గా కన్నయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గ శాసనసభ్యులు విరుపాక్షికి, జడ్పిటిసి, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు, సర్పంచులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసు న్నానని అన్నారు. అదేవిధంగా పార్టీ అభివృద్ధికి నా సాయ శక్తుల కృషిచేసి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు శేషప్ప, ఎంపీపీ తనయుడు ఈసా, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గిరి, ఎంపీపీ తనయుడు ఈసా,ఎంపిటిసి సభ్యులు హనుమప్ప, మల్లికార్జున, సులువాయి సర్పంచ్ మౌలాలి, సింధువాళం కృష్ణయ్య, ఎం రహమతుల్లా, తదితరులు పాల్గొన్నారు.

