15వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా
1 min read
జనసేన కౌన్సిలర్ అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్
కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి రాందాస్ చౌదరి
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : మదనపల్లె పట్టణం లోని 15వ వార్డు సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ తెలిపారు. బుధవారం 15వ వార్డులో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ రాందాస్ చౌదరితో కలిసి అభ్యర్థి చరణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే స్థానిక ఓటర్లను కలుసు కుని వార్డు అభివృద్ధి కి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా రాందాస్ చౌదరి మాట్లాడుతూ 15వ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు జనసేన అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్‌కు ప్రజలు అవకాశం కల్పించాలని కోరారు. వార్డులోని సమస్యలపై అవగాహన కలిగిన యువకుడిగా చరణ్ కుమార్ ప్రజలకు సేవలందిం చేందుకు ముందుకు వచ్చా రని తెలిపారు. ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు హక్కును వినియో గించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ మాట్లా డుతూ వార్డులో పారిశుద్ధ్య నిర్వ హణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ తో పాటు మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తా నని తెలిపారు. ప్రజలకు అందు బాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొ న్నారు.మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు ను బాధ్యతా యుతంగా వినియో గించుకోవాలని, ఎన్నికల రోజున నిమ్మనపల్లి రోడ్డు లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఉమేష్ నాయుడు, విజయమ్మ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లూరు సునీత, శ్యామల జనసేన, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు,వార్డు ప్రజలు పాల్గొ న్నారు.


