పనితీరు మెరుగుపరుచుకుని జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి
1 min read

ప్రతి శాఖ సమన్వయంతో లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
ప్రజల సంతృప్తి శాతాన్ని మెరుగుపరచండి
జిల్లా కలెక్టర్
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లా సమగ్ర అభివృద్ధి సాధనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనితీరును మరింత మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రజా సానుకూలత, ముఖ్య అభివృద్ధి సూచికలు, నియోజకవర్గాల ప్రత్యేక సమస్యలపై జిల్లాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.జిల్లా ర్యాంకింగ్‌లో ముందంజరాష్ట్రంలోని 28 జిల్లాలను పనితీరు ఆధారంగా నాలుగు వర్గాలుగా విభజించగా, నంద్యాల జిల్లా కాంపోజిట్ ర్యాంకింగ్‌లో 6వ స్థానంలో నిలిచి “లీడర్స్” కేటగిరీలో స్థానం సంపాదించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా పురోగతిని మరింత వేగవంతం చేసి రాబోయే సమీక్షలలో ఇంకా మెరుగైన స్థానాన్ని సాధించేలా అన్ని శాఖలు కృషి చేయాలని సూచించారు.జిల్లా ఆర్థిక వృద్ధికి ప్రణాళికలురాష్ట్ర స్థాయి ఆర్థిక వృద్ధిలో నంద్యాల జిల్లా వాటాను పెంచేందుకు వివిధ రంగాల్లో సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గతంలో జిడిపి సహకారంలో 22వ స్థానంలో ఉన్న జిల్లా ప్రస్తుతం 18వ స్థానానికి చేరుకోవడం ప్రగతిని సూచిస్తుందని పేర్కొన్నారు. రాబోయే కాలంలో జిల్లా ఆర్థిక వృద్ధిని మరింత పెంచే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు.వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతిజిల్లాలో వ్యవసాయ రంగంలో సానుకూల పురోగతి నమోదైందని కలెక్టర్ వివరించారు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాది రూ.4,400 కోట్ల నుండి ఈ ఏడాది సుమారు రూ.7,500 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరగడంతో పాటు బీడు భూములను సాగులోకి తీసుకురావడం మరియు ద్విపంట సాగు ప్రోత్సాహం వంటి చర్యలు ఈ వృద్ధికి దోహదపడ్డాయని చెప్పారు.ప్రజలతో అవుట్‌రీచ్ కార్యక్రమాలుప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక అవుట్‌రీచ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి అందిన లబ్ధులను వివరించే కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత సమాచారం అందించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


