NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వచ్ఛ హరిత- చెత్త సంపద తయారీ కేంద్రాల తీరును ప్రజలకు వివరించాలి

1 min read

-ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, ఎంపీపీ చీర్ల

న్యూస్ నేడు చెన్నూరు: గ్రామాలలో పర్యావరణం, పచ్చదనం, పరిశుభ్రతతో పాటు చెత్త సంపద తయారీ కేంద్రాల (ఎస్ డబ్ల్యూ పిసి) పనితీరు దానివల్ల ప్రజలకు రైతులకు కలుగు లాభాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా అధికారులు పనిచేయాలని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్,లు తెలిపారు. శుక్రవారం  సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భాగంగా థీమ్ 5 పరిశుభ్రమైన హరిత గ్రామం, చెత్త సంపద తయారీ కేంద్రాల పనితీరు, పచ్చదనం గురించి మండల పరిషత్ మీటింగ్ నందు వివో లకు డ్వాక్రా మహిళలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, ఎంపీపీ లు మాట్లాడుతూ, గ్రామాలలో పరిశుభ్రత- పరిరక్షణ, సంపూర్ణ ఆరోగ్యం, పచ్చదనంతోనే సాధ్యమని ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలలో మొక్కలు నాటే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. డిప్యూటీ ఎంపీడీవో గురువేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామాలలో ప్రతి ఇంటి పరిసరాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని, అదేవిధంగా పచ్చదనం- పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఎంతో అవసరమని ఆయన అన్నారు. అలాగే తడి చెత్త పొడి చెత్త గురించి తెలియజేస్తూ ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాల పనితీరు హరిత రాయబారుల పనితీరు గురించి తెలియజేశారు. చెత్త సంపద తయారీ కేంద్రాలలో రైతులకు ఉపయోగపడే ఎరువులు ఏ విధంగా తయారు చేస్తారు రైతులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి వంటి విషయాలను ఆయన క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం వెంకటేశు, సీసీలు, వివోలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

About Author