NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జర్నలిస్టుల పై అక్రమ కేసులు బనాయించడం నబబు కాదు

1 min read

హొళగుందలో తహసీల్దారు కార్యాలయ సర్వేయర్ డీటీ ముకుందరావుకు వినతి వజ్రాన్ని ఇస్తున్న ఏపీయూడబ్ల్యూజే నాయకులు.

హొళగుంద న్యూస్ నేడు:  సమాజంలో జరుగుతున్న మంచి, చెడుల గురించి వెలుగులోకి తెచ్చే జర్నలీస్టులు, పత్రికల పై అక్కమ కేసులు పెట్టి భయపెట్టడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్(ఏపీడబ్ల్యూయూజే ) హొళగుంద మండల గౌరవధ్యక్షుడు బిఎం అమీర్సాబ్ అన్నారు. బుధవారం యూనియన్ మండలధ్యక్షుడు చిన్నహ్యాట నాగరాజు ఆధ్వర్యంలో హొళగుంద తహసీల్దారు కార్యాలయం ముందు జర్నలిస్టుల నిరసన చేపట్టి నర్వేయర్ డీటీ ముకుందరావుకు వినతి వజ్రాన్ని అందజేశారు. ఈ సంద ర్భంగా అమీర్సాబ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆదేశాలతో అర్ధరాత్రి సాక్షి కార్యలయంలోకి ప్రవేశించి హంగామ సృష్టించడం, సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, జర్నలిస్టుల పై కేసులు బనాహించడం చూస్తే పత్రిక స్వేచ్ఛను హరించడానికి పూనుకున్నట్లు తెలుస్తోందన్నారు. వార్తల విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే న్యాయ పరంగా ముందుకెళ్లాలే గాని ఇలా క్రిమినల్ కేసులు పెట్టడం, దాడులు, వ్యక్తిగతంగ కక్షలు తీర్చుకోవడం మంచి వద్దతి కాదన్నారు. అక్రమ కేసులతో వేదింపులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురి చేయడం పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ లోపాలను ఎత్తి చూపే వారి పై కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీసుల వేదింపులు, అక్రమ కేసులతో భయపెట్టడం సమంజనం కాదని ఆయన అన్నారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యక్రమంలో సభ్యులు నాగప్ప, విరుపాక్షి, రవికాంత్, ముదున్సర్, మహేశ్ గౌడ్, తాహేర్ బాషా ముల్లా హరున్ తదితరులు పాల్గొన్నారు.

About Author