ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు వెంకట కృష్ణ మృతి చెందడం బాధాకరం: ఎమ్మెల్యే కోట్ల
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలం గోపాలనగరం గ్రామానికి చెందిన చాకలి ఎర్రగొండ వెంకట కృష్ణ (35)ఊటకొండ గ్రామ చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మరణించడం ఎంతో విషాదకరమని డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు.విషయం తెలిసిన వెంటనే డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే , వారి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెంకట కృష్ణ జిందగీ యూట్యూబ్ ఛానల్జర్నలిస్ట్ గా పనిచేస్తు తమ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. విధి ఈత రూపంలో వచ్చి కాటేసింది. అర్థం తకాలంలోనే ఆయన జీవితం ముగిసిపోయింది.అతనికి భార్య , 3,6 సంవత్సరల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు,బందువులు, కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


