అరటి రైతులని ఆదుకోండి…
1 min read

సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగ నాయుడు
ప్యాపిలి న్యూస్ నేడు: నంద్యాల జిల్లాలోని అరటి రైతులని ఆదుకుని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగ నాయుడు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ సుబ్బారెడ్డి, సోమన్న ,ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కే రాధాకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈసందర్భంగా శనివారం ప్యాపిలి మండలం పి ఆర్ పల్లె గ్రామంలో అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 12 వేల ఎకరాల్లో అరటి పంటను రైతులు సాగు చేశారని ప్యాపిలి మండలంలో దాదాపు 3000 ఎకరాల్లో పంటకి పెట్టుబడి లక్షల్లో పెడితే దిగుబడి వేల లో రావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఎకరాకు గు త్త పొలం అయితే రెండు లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుందని సొంత పొలం అయితే లక్షన్నర అవుతుందని కానీ ఇప్పుడు యుద్ధం సాకు చెప్పి కనీసం టన్ను కు మూడు వేల నుంచి 4000 వస్తే పూర్తిగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చొరవ తీసుకొని ప్యాపిలి మండలంలోని రైతులను ఆదుకోవాలని డోన్ మార్కెట్ యార్డ్ లో శీతల గిడ్డంగిలో స్టోరేజ్ చేసి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే రైతుల దగ్గరకు వెళ్లి పరామర్శించాలని లేకపోతే రైతులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మహేష్, పట్టణ కార్యదర్శి వెంకటేష్, రైతు సంఘం నాయకులు పుల్లయ్య, రామ్మోహన్, బాలసుబ్బయ్య రైతులు పాల్గొన్నారు.

