NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రేమకు ప్రతిరూపమే రంజాన్ పండుగ

1 min read

మిడుతూరు మండలంలో ఘనంగా రంజాన్..

న్యూస్ నేడు నందికొట్కూరు: ప్రేమకు ప్రతిరూపమే చిహ్నంగా రంజాన్ పండుగను భక్తిశ్రద్ధల నడుమ నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో ఘనంగా జరుపుకున్నారు.శనివారం తెల్ల జావు తెల్లవారుజాము నుండి ముస్లిం సోదరులురంజాన్ (రమదాన్) పండుగ సందర్భంగా నూతన దుస్తులతో ప్రత్యేకంగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన తొమ్మిదవ నెల ఈ నెలలో సాయంత్రం వరకు ఉపవాసంతో ఉన్నారు. నెలవంక కనిపించడంతో ప్రారంభమై, 29-30 రోజుల తర్వాత ఈద్-ఉల్-ఫితర్ పండుగతో ముగుస్తుంది. మిడుతూరు మండలంలోని తలముడిపి,చౌటుకూరు, కడుమూరు,మాసాపేట, మిడుతూరు,బైరాపురం, అలగనూరు,చెరుకుచెర్ల తదితర గ్రామాల్లో పండుగను ప్రశాంతంగా జరుపుకున్నారు.

About Author