NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగన్మోహన్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదు

1 min read

సాక్షి టీవీలో డిబేట్‌ల‌ను బ‌హిష్కరించాలి

టీడీపీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన తెలుగు మహిళలు

కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ట్ర మ‌హిళ‌ల‌పై మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఏమాత్రం గౌర‌వం లేద‌ని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు మండిప‌డ్డారు. న‌గ‌రంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల‌యం ఎదుట సర్కిల్ లో మ‌హిళ‌లు నిర‌స‌న తెలిపారు. సాక్షి టీవీలో డిబేట్‌ల‌ను బ‌హిష్కరించాల‌ని డిమాండ్ చేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై సాక్షి ఛానెల్‌లో అస‌భ్యక‌రంగా మాట్లాడిన విష‌యంపై జ‌గ‌న్ ఇంత‌వ‌ర‌కు ఖండించ‌లేద‌న్నారు. సాక్షి ఛానెల్‌లో నిర్వహించిన అసహ్యకరమైన డిబెట్‌ను సుప్రీంకోర్టు సమర్దించలేదన్నారు. కొమ్మినేనికి బెయిల్ వ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డిపోతున్నార‌ని, అయితే సుప్రీంకోర్టు ఎక్కడా కొమ్మినేని శ్రీనివాసరావు తప్పు చేయలేదని చెప్పలేదని పేర్కొన్నారు. వేలాది మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి ఆ వ్యాఖ్యను తప్పుబడుతుంటే.. జ‌గ‌న్ మాత్రం మద్దతు పలకడం సిగ్గుచేటు అన్నారు. కొమ్మినేనికి సుప్రీంకోర్టు ఇచ్చింది కండిషన్ బెయిల్ మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలన్నారు. జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి మాత్రం రాష్ట్ర మహిళల పట్ల అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన వారికే మద్దతు పలుకుతునార‌న్నారు. మహిళలంటే జ‌గ‌న్‌కు చిన్న చూపు ఎందుక‌ని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రజ‌లంద‌రూ ఈ అహంకార దోర‌ణిని గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు. జ‌గ‌న్ ఇప్పటికైనా మ‌హిళ‌లంద‌రికీ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అనంతరం కరపత్రాలను రోడ్డుపై పోసి నిప్పు పెట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రమణమ్మ, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు మారుతి శర్మ, మహిళ నేతలు శాంతమ్మ, రాధమ్మ, రేష్మ , ఆయాత్, జనసేన నాయకురాలు అనిత, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, టిడిపి బూత్ ఇంచార్జీలు, పాల్గొన్నారు.

About Author