ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
1 min read

ఆదోని, పెద్దహరివాణం మండలాలుగా విభజన
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు..ఆదోని మండలాన్ని ఆదోని, పెద్దహరివాణం మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం జీవో ఆర్ టి. నం.1503 తేదీ 27-11-2025 ద్వారా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గెజిట్ నం. 796 తో నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు..ఆదోని హెడ్ క్వార్టర్ గా ఆదోని మండలంలో 29 గ్రామాలు, పెద్దహరివాణం హెడ్ క్వార్టర్ గా పెద్దహరివాణం మండలంలో 17 రెవెన్యూ గ్రామాలను ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు.ఆదోని మండలంలో ఆదోని, కల్లుబావి, వెంగళాపురం, పర్వతాపురం, మండిగిరి, ఎస్.కొండాపురం, ఇస్వీ, గోనబావి, దిబ్బనకల్లు, నెట్టేకల్లు, ఆరెకల్, బైచిగేరి, సలకలకొండ, విరుపాపురం, దొడ్డనకేరి, సాంబగల్లు, హువ్వనూరు, కపటి, బసరకోడు, చిన్న పెండేకల్లు, బల్లేకల్లు, మాంత్రికి, దెయ్యాలగూడెం, పాండవ గల్లు, కుప్పగల్లు, జాలిమంచి, సుల్తానాపురం, పెసలబండ, పెద్దతుంబళం గ్రామాలు, పెద్దహరివాణం మండలం లో పెద్దహరివాణం, సంతేకూడ్లురు, యడవల్లి, బలదూరు, చిన్నగోనెహాలు, చిన్నహరివాణం, మదిరె, కడితోట, హానవాళు, జి. హోసళ్లి, బసాపురం, వి.కొండాపురం, నాగనాథనహళ్లి, నారాయణపురం, చాగి, ఢణాపురం, గణేకల్లు గ్రామాలతో మండలాల ఏర్పాటును ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ అయిందన్నారు.ఈ నేపథ్యంలో ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని 30 రోజుల లోపు కర్నూలు లో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లిఖితపూర్వకంగా సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

