NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్టీసిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భధ్రత కల్పించాలి

1 min read

విజయవాడ , న్యూస్​ నేడు  : ఆర్టీసిలో పనిచేస్తున్న ఔట్ సోర్శింగు ఉద్యోగులకు ప్రభుత్వ శాఖలలో ఔట్ సోర్శింగు ఉద్యోగులకు ఇస్తున్న జీతాలు చెల్లించాలి.ఆర్టీసిలో కాంట్రాక్టు వ్యవస్దను రద్దుచేసి ఔట్ సోర్శింగు ఉద్యోగులకు మేనేజ్ మెంట్ ద్వారా డైరెక్టుగా జీతాలుచెల్లించాలిఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్ సోర్శింగుఉద్యోగులందరికీ యూనిఫారం సప్లయి చేయాలి.పియఫ్/ఇ.యస్.ఐ వర్తింపజేయలి .  ఏపియస్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసినందున ఆర్టీసిలో  పనిచేస్తున్న సుమారు 8000 మంది ఔట్ సోర్శింగు ఉద్యోగలకు ఉద్యోగ భద్రత్ర కల్పించేలా చర్యలు తీసుకోని, ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న స్కిల్డ్/సెమీస్కిల్డ్/అన్ స్కిల్డ్, డెటాఎంట్రీ ఇతర విభాగాల్లో ఉద్యోగులకు చెల్లించే జీతాలు మాదిరిగా ఆర్టీసిలో పనిచేస్తున్న అన్ని కేటగిరి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని, వారికి న్యాయం చేయాలని, అంతవరకు ఈ ఉద్యోగులందరికీ చెల్లించే జీతాలు కాంట్రాక్టర్లు ద్వారా కాకుండా ఆర్టీసి మేనేజ్ మెంటే జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన. కార్యదర్శి వెంకటసుబ్బయ్య,రాష్ట్ర ఉపాధ్యక్షులు యల్. నాగసుబ్బారెడ్డి మరియు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, జనరల్ సెక్రెటరీ జి.వి నరసయ్య. విజ్ఞప్తి చేసారు.సోమవారం విజయవాడ గొల్లపూడి వద్ద ఉన్న ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో  ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఔట్ సోర్శింగు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రస్దాయి కార్యకర్తల సమావేశం టి.ముత్యాలరావు అధ్యక్షతన జరిగిందిఈ సమావేశంలో ముఖ్య అతిధిదులుగా పాల్గొన్న ఆర్టీసి ఇ.యు రాష్ట్రఅధ్యక్ష,ప్రధానకార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు,జి.వి.నరసయ్య మాట్లాడుతూ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ కార్మికులు ఈ కాంట్రాక్ట్ విధానం వలన తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు,కావున ఈ  కార్మికులకు ఆర్టిసీ మేనేజ్మెంట్, ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వశాఖలలో  పనిచేస్తున్న ఔట్ సోర్శింగు ఉధ్యోగులకు ఇస్తున్న జీతాలు ఆర్టీసిలో పనిచేస్తున్న ఔట్ సోర్శింగు కార్మికులకు కూడా చెల్లించేలా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని అలాగే ఈసమావేశంలో పాల్గోన్న ఆర్టీసీ ఔట్ సోర్శింగు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టి. ముత్యాలరావు మాట్లాడుతూ…ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి పథకానికి ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ కార్మికులు అన్ని విధాలుగా సహాయపడుతున్నామని తెలిపారు.అలాగే రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్శింగు ఉద్యోగులందరికీ యూనిఫారం సప్లయి చేయాలని,పియఫ్ & ఇ.యస్.ఐ కట్టయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారుఏఐటియుసి ఆద్వర్యంలో రాష్ట్రస్దాయి ఆర్టీసీ ఔట్ సోర్శీంగు ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎంపికగౌరవ అధ్యక్షులు గా యల్.నాగసుబ్బారెడ్డి (AITUC)రాష్ట్ర అధ్యక్షులు టి.ముత్యాలరావు,వర్కింగు ప్రెసిడెంటుగా వేముల బాజీ,ప్రధానకార్యదర్శిగా టి.గంగాంజనేయులు,వైస్ ప్రెసిడెంటుగా పి.సుధీర్,కోశాధికారిగా బి.కుమార్ నాయక్,జాయింటు సెక్రటరీగా పి.మధుసూధన్,ప్రచార కార్యదర్శిగా పి.ప్రసాధ్ కుమార్ తాత్కలికంగా ఎన్నుకున్నారు.త్వరలో పూర్తి 26 జిల్లాలతో కూడిన పూర్తిస్దాయి కమిటిని ఏర్పాటు చేస్తామని ముత్యాలరావు తెలిపారు.

About Author