కేసీఆర్ సంచలన ప్రకటన.. దేశ ప్రజలకు హామీ !
1 min read

పల్లెవెలుగువెబ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన ప్రకటన చేశారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే దేశ వ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. 24 గంటల కరెంట్ తెలంగాణలో మాత్రమే ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు. 2024లో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం పోరాడుతూ దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలన్నారు. ఇందుకోసం ప్రజల ఆశీస్సులు కావాలన్నారు. జాతీయ రాజకీయాలను ప్రారంభిస్తున్నానని కేసీఆర్ సభాముఖంగా ప్రకటించారు.

