NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ కిసాన్ జాగృతి యాత్రకు కిసాన్ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:         , జాతీయ కిసాన్ జాగృతి యాత్రకు కిసాన్ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఏ సూర్య ప్రకాష్ రెడ్డి తెలియజేశారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బి క్రాంతి నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం ఎస్టియు భవన్ లో జరిగిన అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ కిసాన్ జాగృతి యాత్ర ఫిబ్రవరి 7న ప్రారంభమై కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశ వ్యాప్తంగా 40 రోజులు చేపట్టి  మార్చి 19న ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో ముగింపు సభ ఉంటుందని ఈ యాత్రలో కేరళ తమిళనాడు కర్ణాటక ఢిల్లీ పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి జాతీయ రైతు సంఘం నాయకులు ఈ యాత్రలో రావడం జరుగుతుంది ఢిల్లీలో రైతు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున సంయుక్త కిసాన్ మోర్చా 525 సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు ఉద్యమం 13 నెలలు జరిగింది ఆ ఉద్యమంలో జాతీయ రైతు నాయకులు జల్దీర్ సింగ్  జలేవాల 130 రోజులు నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా బిజెపి నరేంద్ర మోడీ  ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పంజాబ్  జగ్జిత్ సింగ్ దళివాల, రాజస్థాన్ ఇందర్జిత్ ఫన్నీ వాళ, హర్యానా అభినయ కోహర్, మధ్యప్రదేశ్ అరుణ్ పటేల్, పంజాబ్ సోను అలోక్, కర్ణాటక నాగరాజ్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు.

About Author