NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలిసి మెలిసి పండుగలు జరుపుకోవాలి … జిల్లా ఎస్పీ

1 min read

శాంతియుత సమావేశం నిర్వహించిన  జిల్లా ఎస్పీ.

నిబంధనలు  పాటించాలి…  పోలీసులకు  సహాకరించాలి.

చట్టం ముందు అందరూ సమానులే , చట్టాలకు లోబడి ఉండాలి.

 సోషల్ మిడియాలో వచ్చే వదంతులను నమ్మకూడదు.

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రజలు కలిసి మెలిసి పండుగలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  తెలిపారు. ఈ సంధర్బంగా బుధవారం జిల్లా ఎస్పీ   జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శాంతియుత సమావేశం నిర్వహించారు. ఈ నెల  7 వ తేదిన బక్రీదు పండుగ సంధర్బంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్నూలు నగరంలోని వివిధ వర్గాలకు చెందిన సామాజిక మత పెద్దలతో  జిల్లా ఎస్పీ  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా  ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్   మాట్లాడుతూ…ప్రజలు కుల, మతాలనే బేధం లేకుండా భక్తి ప్రపత్తులతో అధ్యాత్మిక వాతవరణంలో పండుగలను జరుపుకోవాలన్నారు. అందరూ కలిసి మెలిసి  సోదర భావంతో శాంతియుతంగా ఉండాలన్నారు.  చట్టం ముందు అందరూ సమానులే, చట్టాలకు లోబడి ఉండాలన్నారు. చట్టాలను గౌరవించాలన్నారు. ఒకరినొకరు  గౌరవించుకోవాలన్నారు. చట్టాన్ని చేతుల్లోకి చేతుల్లో తీసుకోకుండా సమాచారం ఇస్తే పోలీసుల పరంగా న్యాయం చేస్తామన్నారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు.  కర్నూలు జిల్లా మతసామరస్యానికి ప్రతీకగా కొనసాగుతుందన్నారు. ఎక్కడైనా  సమస్యలుంటే   డయల్ 100 కి గాని, స్ధానిక పోలీసులకు గాని తెలియజేయాలన్నారు. ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  గట్టి భద్రతను  పటిష్టం చేస్తామన్నారు.అడిషనల్ ఎస్పీ  అడ్మిన్ హుస్సేన్ పీరా  మాట్లాడుతూ… సుహృద్బావ వాతావరణం కల్పించడం కోసం కృషి చేయాలన్నారు. సమయస్ఫూర్తితో ఉండాలన్నారు. వదంతులు నమ్మకూడదన్నారు. సమాజంలో అందరూ సమిష్టి గా ఉంటూ బక్రీదు పండుగ, త్వరలో వచ్చే వినాయకచవితి పండుగలను ప్రశాంతవాతావరణంలో జరుపుకుంటూ పోలీసులకు సహకరించాలన్నారు. కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలోని బాలజీ నగర్ – స్టాంటన్ పురం మధ్యలో ఒక  పోలీసు ఔట్ పోస్టు ఏర్పాటు చేయాలని  మత పెద్దలు జిల్లా ఎస్పీ కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్  హుస్సేన్ పీరా,  కర్నూలు ఇంచార్జ్ డిఎస్పీ  శ్రీనివాసాచారి, మత పెద్దలు, ప్రభుత్వ ఖాజీ మౌలానా షేక్ అబ్దుల్ సలాం, మౌలానా సయ్యద్ జాకీర్ అహమ్మద్ రషాధి,  సందడి చంద్రశేఖర్, గోరంట్ల రమణ, ఇంథియాజ్ ఖాన్ , షాన వాజ్, సిఐలు… తేజమూరి, కేశవరెడ్డి, రామయ్యనాయుడు,  నాగరాజా రావు, తదితరులు  పాల్గొన్నారు.

About Author