లక్కీ విజయ్ కి ఉత్తమ టిడిపి కార్యకర్త గా ప్రశంస పత్రం
1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని మాధవరం గ్రామానికి చెందిన కమ్మరి లక్కీ విజయ్ కుమార్ కు ఉత్తమ టిడిపి కార్యకర్తగా టిడిపి అధిష్టానం గుర్తించింది. దీంతో నూతన సంవత్సరం పురస్కరించుకుని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి, మంచాల సొసైటీ ఛైర్మెన్ రామకృష్ణ రెడ్డి చేతుల మీదుగా గురువారం లక్కీ విజయ్ కి ఉత్తమ టిడిపి కార్యకర్త ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి బూత్ యూనిట్ ఇన్చార్జి గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇతను గతంలో జరిగిన గడపగడపకు టిడిపి కార్యక్రమాన్ని తమ సహచరులతో కలిసి విజయవంతంగా పూర్తి చేసినందుకు టిడిపి పార్టీ అధిష్టానం నుంచి ఉత్తమ కార్యకర్త అనే ప్రశంస పత్రాన్ని అందుకోవడం జరిగిందన్నారు. అనంతరం విజయ్ మాట్లాడుతూ ఈ ప్రశంస పత్రాన్ని మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి వారి సోదరుల చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తన మిత్రుడు కి ఉత్తమ టిడిపి కార్యకర్తగా గుర్తింపు వచ్చినందుకు సంతోషగా ఉందని ఇలాంటి ప్రశంస పత్రాలు ఎన్నో అందుకోవాలని విలేకరి మహబూబ్ బాషా, డాక్టర్ గోపాల్, మజ్జిగ బొజ్జప్ప, గణేష్ లు ఆనందం వ్యక్తం చేశారు.

