NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలుకు గర్వకారణం – ఐపీఎస్ అధికారి డా. జి.వి. సందీప్ చక్రవర్తి

1 min read

6వ రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూల్ నగరానికి చెందిన 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డా. జి.వి. సందీప్ చక్రవర్తి తన 6వ రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ (పిఎంజి) అందుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం నేడు ప్రకటించింది. ఆగస్టు 15, 2025న న్యూఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ జాతీయ వేడుకల సందర్భంగా ఆయన ఈ మెడల్‌ను స్వీకరించనున్నారు.ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఆయన ధైర్యం, సాహసం మరియు కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో చురుకైన పాత్ర పోషించడాన్ని గుర్తించి ప్రదానం చేశారు.కర్నూల్‌లో పుట్టి పెరిగిన డా. జి.వి. సందీప్ చక్రవర్తి, డా. జి.వి. రామ గోపాల్ రావు (రిటైర్డ్ ఆర్‌ఎంఓ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కర్నూల్) మరియు పి.సి. రంగమ్మ (రిటైర్డ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారి) లయొక్క కుమారుడు. ఆయన మాంటెస్సోరి పబ్లిక్ స్కూల్, ఏ-క్యాంప్, కర్నూల్‌ లో పాఠశాల విద్యను పూర్తిచేసి, కర్నూల్ మెడికల్ కాలేజ్ నుండి వైద్య విద్య పూర్తిచేశారు. అనంతరం 2014లో భారత పోలీసు సేవ (ఐపిఎస్​)లో చేరారు.ప్రస్తుతం సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్​ఎస్​పి), శ్రీనగర్‌గా పనిచేస్తున్న ఆయన, గతంలో జమ్మూ & కాశ్మీర్‌లో అనేక కీలక పదవులు నిర్వహించారు:

ఇప్పటివరకు అందుకున్న అవార్డులు & గౌరవాలు:

  1. రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ (PMG) – 5 సార్లు, 2. జమ్మూ & కాశ్మీర్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ – 4 సార్లు, 3. ఇండియన్ ఆర్మీ చీఫ్ కమండేషన్ డిస్క్4. నార్తర్న్ ఆర్మీ కమాండ్ కమండేషన్ డిస్క్5. జమ్మూ & కాశ్మీర్ DGP కమండేషన్ డిస్క్, 6. CRPF & ITBP DGP కమండేషన్ డిస్క్ – మొత్తం 7 సార్లుడా. జి.వి. సందీప్ చక్రవర్తి  ఈ విజయము తెలుగు ప్రజలకు గర్వకారణం మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ యువతకు ఒక ప్రేరణగా నిలుస్తోంది

About Author