NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

1 min read

సమాజంలో వివక్షత పోయేంతవరకు,మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాల కొరకు పోరాడుతాం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్

ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో కార్యదర్శి ఉప్పులూరి హేమా శంకర్ అధ్యక్షతన కార్యక్రమం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ అధ్యక్షతన  మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి కార్యక్రమం ఆర్.ఆర్. పేట స్ఫూర్తి భవన్ నందు జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. జోహార్ మహాత్మ జ్యోతిబా పూలే, సాధిస్తాం జ్యోతిబా పూలే ఆశయాలను, పోరాడతాం సమాజంలో వివక్షత పోయేంత వరకు అంటూ నినాదాలు చేశారు. అనంతరం డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తనకు మార్గదర్శి, ఆదర్శప్రాయుడు మహాత్మ జ్యోతిబా పూలే అని అనేక సందర్భాల్లో చెప్పేవారని తెలిపారు. 200 ఏళ్లకు పూర్వమే ఈ సమాజంలో ఉన్న అనేక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి జ్యోతిబా పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో  ఏరియా సమితి కార్యవర్గ సభ్యులు, కొల్లూరి సుధారాణి, గొర్లి స్వాతి,మావూరి విజయ,బళ్ల కనక దుర్గారావు,శాయన అభిలాష్ కుమార్, ఏరియా కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, ఎం.ఏ.హకీమ్,1డివిజన్ కార్యదర్శి లక్కోజు జగదీశ్వరి,జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, ఉప్పులూరి లక్ష్మి, భవాని,జ్యోతి,వి. విజయలక్ష్మి, ఎన్.అనంతలక్ష్మి 29 డివిజన్ ఎం.సత్యవతి, ఎం.లలిత, ఇ.లక్ష్మి,ఎస్.బుజ్జి,ఎం. సత్యవతి, పాల రామకృష్ణ, ఎర్ర వెంకటేశ్వర రావు, దాసిపల్లి ఆదినారాయణ, ఆటోనగర్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు, తాళ్లూరి సురేఖ, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *