NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నవంబర్ 10 న జరుగు బస్సు జాత సదస్సును జయప్రదం చేయండి 

1 min read

పత్తికొండ మోడల్ కళాశాల పాఠశాల రోడ్డు వేయాలి 

పత్తికొండ, న్యూస్​ నేడు: నవంబర్ 10 న విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బస్సుజాత సదస్సును జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి సోమన్న పిలుపునిచ్చారు. మంగళవారం  ఏఐఎస్ఎఫ్ పత్తికొండ మండల సమితి ఆధ్వర్యంలోన స్థానిక మోడల్ పాఠశాల, కళాశాల విద్యార్థుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త బస్సుజాత నవంబర్ పదవ తేదీన కర్నూలు నగరానికి చేరుకుంటుందని, ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి  విద్యార్థుల సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా స్థానిక విద్యాధికారుల నిర్లక్ష్యం మూలంగా పత్తికొండ ప్రాంతంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పత్తికొండ మండలంలోని బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు కనీస వసతులు లేక వర్షం వస్తే వర్షం నీళ్ళు కారుతూ దాని కిందే సేద తీరుతున్నటువంటి పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావున తక్షణమే బీసీ బాలికల హాస్టల్ వసతి గృహానికి మరమ్మతులు చేపించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అలాగే గుంతల మయమైన పత్తికొండ  మోడల్ పాఠశాలకు బీటీ రోడ్డు లేదా సిసి రోడ్డు వేయాలని కోరారు. మోడల్ పాఠశాలలో బాత్రూములకు ఘడియలు లేక విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కావున స్థానికంగా ఉన్న విద్యార్ధుల సమస్యలను విద్యాధికారులు తక్షణమే పరిశీలించాలని నేను ఎడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

About Author