NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చట్టాలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగివుండాలి

1 min read

వక్ఫ్ లాస్ రచయిత –  ఏ.ఎండి. ఇంతియాజ్ ఐఏఎస్​

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు నగరం ఓల్డ్ సిటీలోగల ఉస్మానియా కళాశాల నందు వక్ఫ్ లాస్ పుస్తక సమీక్ష కార్యక్రమము జరిగింది. ముందుగా  –  ఏ.ఎండి. ఇంతియాజ్ ఐఏఎస్ వారి గురువు శ్రీ కృష్ణా రెడ్డి ని,  గాంధేయవాది శ్రీ కల్కూర చంద్ర శేఖర్ ని సన్మానించారు అనంతరం మాట్లాడుతూ చట్టాలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని సరళ మైన భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పుస్తకాన్ని రచించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 లో చేసిన సవరణలు, కోర్టు తీర్పులు సైతం తెలియజేస్తూ పుస్తకంలో పలు అంశాలను క్లుప్తంగా వివరించానని, ప్రతి వ్యక్తి ఈ పుస్తకాన్ని చదివి విజ్ఞానాన్ని పొందాలని అన్నారు తాను ప్రభుత్వం లో మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా పనిచేస్తున్నప్పుడు చాలా కోర్ట్ కేసులు పరిష్కరించాల్సి వచ్చేదని, ఆ విధంగా చట్టాలను చదివి వక్ఫ్ చట్టాలపై పుస్తకాన్ని రాయాలని అనిపించి ఎంతో భాద్యతతో ఈ పుస్తకాన్ని రచించానని అన్నారు.(మాంటిసోరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్), జనాబ్ డా మన్సూర్ రెహమాన్ సాబ్ (కర్నూలు డిస్ట్రిక్ట్ ఇంటెలెక్టువల్ ఫోరం), ప్రొఫెసర్ సమీఉద్దీన్ సాబ్ (ప్రిన్సిపాల్ ఉస్మానియా కాలేజీ) ముస్లిం మైనారిటీ నాయకులు సాహిత్యభిమానులు పాల్గొన్నారు.

About Author