NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిడుతూర్ వార్త విలేఖరి..అనారోగ్యంతో మృతి

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  : నంద్యాల జిల్లా మిడుతూరు వార్త సీనియర్ పాత్రికేయులు మధు అనారోగ్యంతో మృతి చెందారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గత నెల రోజులుగా కిడ్నీ సమస్య మరియు శరీరం ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆస్పత్రి నుండి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత గురువారం రాత్రి ఆరోగ్యం విషమించడంతో కర్నూలు ఓమ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈయన గత 25 సంవత్సరాలుగా మిడుతూరు మండలంలో పాత్రికేయులుగా పని చేస్తున్నారు.ఈయనకు భార్య మరియు పిల్లలు వైష్ణవి (17), మోక్షిత్(14) ఉన్నారు.ఈయన మంచి వార్తలు రాస్తూ ప్రజల మన్ననలు పొందారు.ఈయన మృతి చెందడం పట్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

About Author