మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలను కలిసిన మంత్రి
1 min read

ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ, సమస్యల పరిష్కారానికి హామీ
మంగళగిరి, న్యూస్ నేడు: సుపరిపాలనలో -తొలి అడుగు కార్యక్రమం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలను విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలుసుకున్నారు. వారి నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ప్రతి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యల త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రతి ఒక్కరితో కలిసి ఫోటోలు దిగారు.

