ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రులు… ఎమ్మెల్యేల సమావేశం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఈ నెల 16 న కర్నూల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభ పర్యటనలో భాగంగా కేడీసీసీబీ బ్యాంక్ చైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసారావు ,మంత్రులు నిమ్మల రామానాయుడు ,పొంగూరు నారాయణ , రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ,మంత్రి సబితమ్మ ,మంత్రి గుమ్మడి సంధ్య రాణి ,బీసీ జనార్ధన్ రెడ్డి ,గొట్టిపాటి రవికుమార్ ,పలువురు ఎంఎల్సీ లు బీద రామచంద్ర యాదవ్, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి ,ఎమ్మెల్యేలు, ఎమ్మెస్ రాజు,ఉగ్ర నరసింహారెడ్డి , జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కా రెడ్డి , ఎంపీ పార్థసారథి , బస్తిపాటి నాగరాజు , కోడుమూరు అబ్జర్వర్ కట్టప్ప రామలింగారెడ్డి ,కి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై చర్చించుకోవడం తో పాటు నియోజకవర్గ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

