ప్రజలతో ముఖ ముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి , నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ ఈ రోజు ప్యాపిలి మండలంలోని చంద్ర పల్లె చెరువు,ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈ సందర్శనలో పాల్గొని చెరువు ప్రస్తుత పరిస్థితి, నీటి పారుదల సామర్థ్యం, వర్షాకాలంలో వచ్చే నీటి ప్రవాహం, మరియు సాగునీటి అవసరాలపై వివరమైన నివేదికను సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ చెరువు పరిసరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించి, స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు.అనంతరం గ్రామ ప్రజలతో ముఖ ముఖి కార్యక్రమంలో పాల్గొనారు ,ప్రజలకు మెరుగైన నీటి సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపారు.

