దసరా ఉత్సవాలకు ప్రత్యేక అలంకరణలు… ఈఓ
1 min read

మహానంది, న్యూస్ నేడు: దసరా ఉత్సవాలకు ప్రత్యేక అలంకరణలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహనాది కారి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం ఆలయంలో పూల అలంకరణ, విద్యుత్ అలంకరణ ఏర్పాట్లకు టెండర్లు నిర్వహించారు. ఇందులో పూల అలంకరణ చేసేందుకు 8 లక్షల 30 వేల రూపాయలకు జగన్ దక్కించుకున్నారు. విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేసేందుకు మణికంఠ ఏజెన్సీ 2లక్షల 50 వేల రూపాయలకు దక్కించుకున్నారు. భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు ఉండాలని ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఈఓ మధు, సూపర్డెన్స్ నీలకంఠం రాజు, సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

