NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మొక్కలు నాటిన ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్…

1 min read

హరితాంధ్ర కోసం అడుగేద్దాం : ఎమ్మెల్యే 

పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్‌

పత్తికొండ, న్యూస్​ నేడు:  మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారమని ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ తెలిపారు. గురువారం పత్తికొండ పట్టణంలోని కర్నూల్ ప్రధాన రహదారి ప్రక్కన మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంలో  అధికారులు, నాయకులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.వాతావరణంలో మార్పులు కాలుష్యం గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు చెట్లను నాటాలని అన్నారు. చెట్ల నాటడం వల్ల మంచి వర్షాలు కురుస్తాయని, ఆ వర్షాల వల్ల కురిసిన నీటిని ఆదా చేయాలని సూచించారు.  పర్యావరణం నుండి భూమిని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే సరైన మార్గమన్నారు. మన భూమిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  పత్తికొండ పట్టణంలో ప్రతి ఒక్కరు తమ ఇండ్ల వద్ద మొక్కలు  నాటి పచ్చదనాన్ని పెంచాలని కోరుతున్నామన్నారు.

About Author