మోడీ హఠావో దేశ్ కు బచావో..!
1 min read

బిజెపి కూటమి ప్రభుత్వం దొంగ ఓట్లతో గెలిచింది
ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎం. కాసిం వలి
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో దేశంలో ఎన్ డి ఏ బిజెపి కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో దొంగ ఓట్లతో మరియు ఈవీఎంల ట్యాంపరింగ్ లతో అడ్డదారులు అధికారాన్ని చేపట్టి , దేశంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఖాసిం వలి ఆధ్వర్యంలో స్థానిక వైయస్సార్ సర్కిల్ నందు రాష్ట్ర స్థాయి పిలుపుమేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఈవీఎంల ట్యాంపరింగ్ మరియు దొంగ ఓట్లు మరియు రిలయన్స్ అధినేత ఆదాని అంబానీలతో ఉమ్మక్కై దేశంలో అధికారం చేపట్టిందని ఎద్దేవా చేశారు. బిజెపి ప్రభుత్వం మరియు ఎలక్షన్ కమిషన్ కలిసి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి దేశంలో అధికారం చేపట్టిందని తెలిపారు. దేశ ప్రజలు ఈ ఎలక్షన్ కమిషన్ పై బిజెపి ప్రభుత్వంపై మోసపూరిత అక్రమాలపై ఆలోచిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ పద్ధతిని నిర్వహించాలని తెలిపారు. ఈవీఎంల వల్ల అనేక అక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. దేశంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ క్షణమైన కుప్పకూలే అవకాశం ఉందన్నారు. దేశ ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. దేశ ప్రజలు యువత విద్యార్థులు నిరుద్యోగులు రైతులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షబ్బీర్, అసిఫ్, హజరత్ వలి, కాసిం భాస్కర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

