అవినీతికి పాల్పడిన ప్రిన్సిపల్ ను విచారణ జరిపి సస్పెండ్ చేయాలి
1 min read

డిప్యూటీ డిఇఓ కి ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాలు. ఆర్ యు ఎస్ ఎఫ్.ఆర్ పి ఎస్ ఎఫ్.ఆర్ ఎ వి ఎఫ్.
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: గోనెగండ్ల మండలం లో ఉన్నటువంటి ఏపీ స్కూల్ ప్రిన్సిపాల్ సీట్ల సర్దుబాటు విషయంలో అవినీతికి పాల్పడిన ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలని ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రిది ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథ్ ఆర్ ఏ వి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాజా డిప్యూటీ డీఈవో కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది డిప్యూటీ డీఈఓ సానుకూలంగా స్పందించి విచారణ జరిపించి విద్యార్థులకు తగిన న్యాయం చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ గోనెగండ్ల మండలం ఏపీ మోడల్ స్కూల్ లో సీట్ల విషయంలో ప్రిన్సిపల్ అవకతవకలు చేయడం జరిగింది మెరిట్ ఉన్న విద్యార్థులకు కాకుండా మెరిట్ లేనటువంటి విద్యార్థులకు సీట్లు ఎలా ఇస్తారని మెరిట్ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ పిల్లలకు సీటు వచ్చింది అని వారు చెప్పడం జరిగింది. టిసి తీసుకుని రమ్మని చెప్పగా ఆ తల్లిదండ్రులు కొన్ని రోజుల తర్వాత వేరే పాఠశాలలో చదువుతున్నటువంటి ఆ విద్యార్థుల టీసీ తీసుకొని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి రాగా ఆమె సీట్లు అయిపోయినాయి అని మీ సీట్లు వేరే విద్యార్థులకు ఇచ్చేసామని వారు అనడం దారుణమని మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి నేను చేసిందే న్యాయం చేసిందే చట్టం అని ఆమె తాను ఇష్టానుసారంగా చెప్పుకొని రావడం జరిగిందని హాస్టల్ విషయాల్లో అయితే తమకు అనుకూలమైనటువంటి విద్యార్థులకు ఇస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలను గంగలో కలపడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కావున మీరు ఆమెపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని వారు హెచ్చరించారు లేని పక్షంలో మరిన్ని ఉద్యమాలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు.

