NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వనభోజన కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎం పి బస్తిపాటి నాగరాజు                  

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్వర్యంలో జరిపే కార్తీక వనభోజన కరపత్రాన్ని ఈ రోజు ఉదయం పంచాలింగాల లోని వారి నివాసం వద్ద ఎంపీ బస్తిపాటి నాగరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. నవంబరు 2 వ తేదీన  శ్రీ భీరలింగేశ్వర స్వామి  దేవాలయం పెద్దపాడు రోడ్డులో ఎపి మోడల్ స్కూల్ దగ్గర జరిగే కార్తీక వనభోజన కార్యక్రమంలో కురువ కులస్థులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎంపీ కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కురువ సంఘం  జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ, ప్రదానకార్యదర్శి అనిత,జిల్లా ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, బి.వేంకటేశ్వర్లు,పాల సుంకన్న,కె. సి.  నాగన్న, తవుడు శ్రీనివాసులు, పెద్దపాడు పుల్లన్న, పర్ల చిరంజీవి మద్దిలేటి, బి. బాలరాజు, బి. తరుణ్, ఆటోగ్యారేజ్ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కురువ కులస్థులందరూ పాల్గొని విజయవంతం చేయాలని  కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సవితమ్మ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హిందూపురం ఎంపీ పార్థసారథి ప్రముఖులను ఆహానిస్తున్నట్లు కర్నూలు జిల్లా కురువ సంఘం కమిటీ సభ్యులు తెలిపారు.

About Author