NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది జీతాలు పెంచాలి..

1 min read

కర్నూలు జిల్లా మాజీ కేడిసిసి అధ్యక్షురాలు శ్రీ ఎస్వీ విజయ మనోహరి

కర్నూలు, న్యూస్​ నేడు:   కర్నూల్ నగర పాలక సంస్థ లో పని చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది నిరసన కార్యక్రమము లో కర్నూలు జిల్లా మాజీ కేడిసిసి అధ్యక్షురాలు శ్రీ ఎస్వీ విజయ మనోహరి  సందర్శించి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా  మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ సిబ్బంది చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని జీతాలు పెంచి అదేవిధంగా ఇతర తాత్కాలిక సిబ్బందికి లభిస్తున్నట్లు సంక్షేమ పథకాల కూడా అర్హులను చేయాలని  కోరారు. ప్రభుత్వం ఇంజనీరింగ్ సిబ్బందిని మరియు శానిటేషన్ వర్కర్స్ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించరాదని     ఇతర సిబ్బందికి లభించే విధంగా 69 రోజుల  సెలవును కూడా మంజూరు చేయాలని  ఉద్యోగంలో మరణించిన వారి కుటుంబాల కు పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులకు వైఎస్ఆర్సిపి పార్టీ అండగా నిలుస్తుందని  వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో 43 వ కార్పొరేటర్ మునియమ్మ, మల్లి, ఎస్టీ బాబు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author