బాధ్యతలు చేపట్టిన మున్సిపాలిటీ ఆర్వో బాబు
1 min read

నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పురపాలక సంఘం నూతన రెవెన్యూ అధికారిగా బి.బాబు బాధ్యతలు చేపట్టారు. శనివారం పట్టణ పురపాలక కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. నరసరావుపేట మున్సిపాలిటీలో పని చేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చినట్లు ఆర్వో తెలిపారు.ఇక్కడ ఉన్న ఆర్వో మధుబాబు ప్రొద్దుటూరుకు బదిలీపై వెళ్లినట్లు మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డి అన్నారు.పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూరెవెన్యూ సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని నూతన ఆర్వో బాబు తెలిపారు. ముందుగా మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డిని నూతన ఆర్ఓ మర్యాదపూర్వకంగా కలిశారు.

