NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ఆకాశ్​ ’లో.. డా. ఎన్​.టి.ఆర్. ఆరోగ్య శ్రీ సేవలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: నగరంలోని గాయత్రి ఎస్టేట్​ లోని ఆకాశ్​ హాస్పిటల్​ లో డా. ఎన్​ .టి.ఆర్​. ఆరోగ్య శ్రీ వైద్య సేవలు  అందిస్తున్నామని హాస్పిటల్​ ఎండి. జనరల్​ ఫిజిషియన్​ డా. శ్రీ హరి తెలిపారు. బుధవారం ఆయన ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు.  తమ హాస్పిటల్​ లో  ఎన్టీ ఆర్ ఆరోగ్య శ్రీ వైద్య సేవల కింద  ఆర్థో పిడియక్స్​ మరియు పాలీ ట్రుమా, ప్లాస్టిక్​ సర్జరీ, నెఫ్రాలజి, యురాలజి,  పీడియాటిక్స్​ ( మెడికల్​ ), జనరల్​ సర్జరీ, గైనకాలజి మరియు ఈ.ఎన్​.టి. వైద్య సేవలకు అనుమతి లభించిందని  ఈ సందర్భంగా డా. శ్రీ హరి వెల్లడించారు.  హాస్పిటల్​ లో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని, అలాగే అన్ని రకాల హెల్త్​  ఇన్సూరెన్స్​ కింద వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.  అంతేకాక 24 గంటలకు ఐసీయూ, ఎన్​ఐసీయూ ఎమర్జెన్సీ  డాక్టర్లు బృందం ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు, శస్ర్త చికిత్సలు చేస్తామని, ఈ అవకాశాన్ని రాయలసీమ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా  ఆకాశ్​ హాస్పిటల్​ అధినేత, డయాబెటిస్​ వైద్యులు డా. శ్రీ హరి కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *