17 న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం
1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : విద్యార్థులందరూ తప్పనిసరిగా నులి పురుగులు నివారించే అల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లో ఈ నెల 17 వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఫిబ్రవరి 17 వ తేదీన జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా 1-19 సంవత్సరాల లోపు విద్యార్థులందరి చేత నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని కలెక్టర్ విద్యాశాఖల అధికారులను, ఐసిడిఎస్ పిడి ని ఆదేశించారు..అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటిఐ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరిచేత ఆల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 1సం. నుండి 2సం.లు ఉన్న చిన్నారులకు సగం మాత్ర, 3సం.ల నుండి 19సం.ల ఉన్న వారికి ఒక మాత్ర వేసుకోవాలన్నారు. నులిపురుగులు శరీరంలో ఉండడం వల్ల చదువులో ఏకాగ్రత లోపించడం, రక్తహీనత, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయన్నారు. విద్యార్థులు ఈ మాత్రలు తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అల్బెండజోల్ మాత్రలను పిల్లలకు పంపిణీ జరుగుతుందని, ఒక వేళ ఆ రోజున మాత్రలు వేసుకోని పక్షంలో వారికి మాప్ అప్ కార్యక్రమం ద్వారా ఈనెల 24 వ తేదీన అల్బెండజోల్ మాత్రలను అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు . కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా.భాస్కర్ రాజు, ఐసిడిఎస్ పిడి విజయ, సంబధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

