NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధునాతన ఎండోస్కోపిక్ విధానంతో విజయవంతంగా చికిత్స

1 min read

– మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్యాంక్రియాస్ సంబంధిత తీవ్రమైన సమస్యతో నెలల తరబడి బాధపడుతూ, పెద్ద శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించిన ఓ రోగికి శస్త్రచికిత్స అవసరం లేకుండానే ERCP (Endoscopic Retrograde Cholangiopancreatography) అనే అధునాతన ఎండోస్కోపిక్ విధానంతో విజయవంతంగా చికిత్స అందించి మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు వైద్య బృందం మరో అరుదైన విజయాన్ని నమోదు చేసింది.హరి కృష్ణ అనే రోగికి సుమారు 8 నెలల క్రితం తీవ్రమైన ప్యాంక్రియాటిక్ డక్ట్‌ లీక్‌ వచ్చింది. అప్పటి నుంచి తరచూ కడుపునొప్పి, కడుపు ఉబ్బరం (Abdominal Distension), బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినప్పటికీ సమస్యకు ఖచ్చితమైన కారణాన్ని గుర్తించలేకపోయారు. కొంతమంది వైద్యులు క్లిష్టమైన మరియు ఖరీదైన శస్త్రచికిత్స అవసరమని కూడా సూచించారు.చివరగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & హెపటాలజిస్ట్ డా. పి. అబ్దుల్ సమద్ గారిని సంప్రదించారు. రోగిని సమగ్రంగా పరీక్షించిన అనంతరం MRCP (Magnetic Resonance Cholangiopancreatography) మరియు అవసరమైన ఇతర పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల ద్వారా రోగికి ప్యాంక్రియాటిక్ డక్ట్‌ లీక్‌ ఉన్నట్లు ఖచ్చితంగా నిర్ధారించారు. ఇది ప్యాంక్రియాస్ నుంచి లీక్ అయిన ద్రవం కడుపులో చేరే అరుదైన మరియు క్లిష్టమైన పరిస్థితి.సమస్యను గుర్తించిన అనంతరం రోగికి ERCP ప్రక్రియ నిర్వహించి, ప్యాంక్రియాటిక్ డక్ట్‌లో ఉన్న లీక్‌ను స్టెంట్ ద్వారా సరిచేసి (Bridging the Pancreatic Duct Leak) చికిత్స అందించారు. ఈ అధునాతన ఎండోస్కోపిక్ విధానం వల్ల పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే సమస్యను విజయవంతంగా పరిష్కరించారు.ERCP అనంతరం రోగి ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. కడుపు ఉబ్బరం తగ్గిపోవడంతో పాటు నొప్పి కూడా పూర్తిగా తగ్గింది. కొద్ది రోజుల పర్యవేక్షణ అనంతరం రోగిని ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశారు.ఈ సందర్భంగా డా. పి. అబ్దుల్ సమద్  మాట్లాడుతూ, “ప్యాంక్రియాటిక్ డక్ట్‌ లీక్‌ అనేది అరుదుగా కనిపించే కానీ క్లిష్టమైన సమస్య. సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. గతంలో ఇలాంటి సమస్యలకు పెద్ద శస్త్రచికిత్సలు అవసరమయ్యేవి. అయితే ప్రస్తుతం ERCP వంటి ఆధునిక ఎండోస్కోపిక్ విధానాల ద్వారా శస్త్రచికిత్స లేకుండానే చికిత్స అందించడం సాధ్యమవుతోంది. దీంతో రోగి త్వరగా కోలుకోవడంతో పాటు ఆసుపత్రిలో ఉండే రోజులు మరియు చికిత్సకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది” అని తెలిపారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ, “మెడికవర్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక ఎండోస్కోపీ మరియు గ్యాస్ట్రోఎంటరాలజీ సేవల ద్వారా క్లిష్టమైన జీర్ణాశయ, ప్యాంక్రియాస్ సంబంధిత వ్యాధులకు కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండా చికిత్స అందిస్తున్నాం. ఖచ్చితమైన నిర్ధారణ, నిపుణులైన వైద్య బృందం మరియు ఆధునిక సాంకేతికతతో రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం మా లక్ష్యం. ఈ కేసు ద్వారా పెద్ద శస్త్రచికిత్సను విజయవంతంగా నివారించడం మా వైద్య బృందం నైపుణ్యానికి నిదర్శనం” అని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *