NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర పోటీలకు’నవనంది’ విద్యార్థుల ఎంపిక..

1 min read

నవనంది పాఠశాల చైర్మన్ శ్రీధర్..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ నవనంది హైస్కూల్ విద్యార్థులు ఎస్ జిఎఫ్ రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక అయినట్లు పాఠశాల చైర్మన్ బి.శ్రీధర్ గురువారం తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ గత నెలలో 21 న నంద్యాల పద్మావతి స్టేడియంలో జరిగిన పోటీల్లో విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు ఈనెల 7,8,9 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటున్నారని పోటీలకు ఎంపికైన విద్యార్థులు:పదవ తరగతి సి చరణ్,9వ తరగతి హిమతేజ,  అల్తాఫ్ అలీ జూడో పోటీలకు ఎంపిక అయినట్లు పాఠశాల చైర్మన్ శ్రీధర్ తెలిపారు. విద్యార్థులను చైర్మన్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు.

About Author