NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండలో రైతన్న మీకోసం కార్యచరణ ప్రణాళికా సభ నిర్వహణ   

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:   పత్తికొండ మండలం, పత్తికొండ మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రైతన్న మీకోసం కార్యచరణ ప్రణాళిక గ్రామసభ ఏర్పాటు చేశారు. మండల వ్యవసాయ అధికారి మెకడ రాముడు వి ఏ ఏ లు  ప్రఖ్యాతి, రాణి,  శివలింగం  సమన్వయంతో 2026, 27 వ్యవసాయ సీజన్ల కార్యచరణ ప్రణాళికపై రైతులతో చర్చించారు. అలాగే రైతుల నుండి విలువైన సూచనలు సేకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో కలిసి వీక్షించారు. ఆదర్శ రైతులు రామకృష్ణ రామచంద్ర చౌదరి ఈ సభలో పాల్గొని వ్యవసాయ విధానంపై అధికారులతో చర్చించారు. అనంతరం వ్యవసాయ కార్యాచరణ పై  రైతులకు అధికారులు పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు టీడీపీ నాయకులు లక్ష్మీ నారాయణ, బీజేపీ మండల అధ్యక్షుడు కరణం నరేష్, అసెంబ్లీ కో కన్వీనర్ గోవర్థన్ నాయుడు,సీసీ రంగన్న, శంకరయ్య, కర్ణం చంద్రన్న నాయకులు రైతులు  తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో గ్రామ సచివాలయ ఉద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author