రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన పంచాయితీ రాజ్ డి ఈ
1 min read

భాస్కర్, ఎ ఈ వాసుదేవ మూర్తి..
హొళగుంద న్యూస్ నేడు : చిన్న హ్యాట గ్రామం వరకు బిటి రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చిన్నహ్యాట గ్రామం వరకు బిటి రోడ్డు, చిన్నహ్యాట గ్రామం నుండి ఆలూరు వరకు రోడ్డు మరమ్మత్తులకు రూ.3.60 కోట్ల రూపాయల పంచాయతీరాజ్ నిధులతో 25 కిలోమీటర్ల మేర జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంగళవారం పంచాయతీరాజ్ డి ఈ భాస్కర్, ఎ ఈ వాసుదేవ మూర్తి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని,నాణ్యత విషయంలో రాజీ పడకుండా రోడ్డు నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్ సుగుణ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ ను అధికారులు సూచించారు. ఈ రోడ్డు గుండా నియోజకవర్గ కేంద్రం ఆలూరు, ఆదోని లతోపాటు రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ఎల్లార్తి దర్గాలకు నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తుంటారు. రోడ్డు నిర్మాణం చేపట్టుతుండడంతో ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


