NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్న క్యాంటీన్ శుభ్రంగా ఉండాలి

1 min read

అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసిన మున్సిపాలిటీ కమిషనర్..

నందికొట్కూరు న్యూస్ నేడు: అన్న క్యాంటీన్ గురించి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి..నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్ ను సోమవారం ఉదయం మున్సిపాలిటీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన వసతి ఏ విధంగా ఉందనే వాటిపై అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.క్యాంటీన్ లో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి శానిటేషన్ పరిస్థితులపై అందిస్తున్న ఆహార నాణ్యత,నిర్వహణ విధానాలను మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసిన తర్వాత పట్టణంలో సంగయ్య పేట,హాజీ నగర్,మారుతి నగర్,నంద్యాల రోడ్డులో లింగం వీధి,జూనియర్ కాలేజీ పలు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ పరిస్థితులను పరిశీలించారు.వీధుల్లో పరిశుభ్రత,చెత్త తొలగింపు, డ్రైనేజీ నిర్వహణ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించి ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కమీషనర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఏఈ మనోజ్ రెడ్డి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author