బిజినవేముల’లో పింఛన్ల పంపిణీ..
1 min read

మండల కన్వీనర్ మాండ్ర..గ్రామ సర్పంచ్ రవి యాదవ్
నందికొట్కూరు న్యూస్ నేడు: పింఛన్ దారుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని నందికొట్కూరు టిడిపి మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి మరియు బిజినవేముల గ్రామ సర్పంచ్ రవి యాదవ్ అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బిజినవేముల గ్రామంలో గ్రామ సర్పంచ్ రవి యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమాన్ని ఏర్ చేపట్టారు.ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి హాజరై సర్పంచ్ రవి యాదవ్ తో కలిసి వివిధ రకాల పింఛన్లను లబ్ధిదారుల ఇండ్లకువెళ్లి నగదును పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయనంతగా అన్ని రకాల పింఛన్లను పెంచిన ఘనత కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైంది అని వారు అన్నారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లోదాదాపుగా అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చడం హర్షించదగ్గ విషయమని మరియు గ్రామ సర్పంచ్ రవి యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిలేటి,నారాయణ,సురేష్, మహేంద్ర,హుసేన్ మియ్యా, నాగరాజు,గోరి వెంకటేశ్వర్లు, కృష్ణ,లక్ష్మీఈశ్వర్ గౌడ్, సుబ్బారాయుడు,మౌలాలి మరియు వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.

