ప్రజలు డిజిటల్ మోసాల పై అప్రమత్తంగా ఉండాలి
1 min read

మీ భద్రత … మీ చేతుల్లోనే ఉంది.
లాంటి అనుమానాస్పద లింకులు వచ్చినా క్లిక్ చేయకుండా ఉండండి.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కర్నూలు,న్యూస్ నేడు: ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అదే వేగంతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని బ్యాంక్ మోసాలు, సోషల్ మీడియా వంచనలు, ఫేక్ లింకులు, UPI మోసాలు మొదలైనవి సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు జిల్లా ప్రజలకు ఆదివారం తెలిపారు.
ఇటువంటి మోసాలను ప్రజలు ఎలా నివారించాలి?మీ OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దు అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దు. ఫోన్ కి వచ్చిన అజ్ఞాత వ్యక్తుల మెసేజ్ లు, కాల్స్ కు స్పందించవద్దు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకండి. మీ ఫోన్లో ఫేక్ యాప్స్ ఇన్స్టాల్ చేయవద్దు. సైబర్ మోసానికి గురైతే వెంటనే చేయవలసినది: సైబర్ హెల్ప్ లైన్ నంబర్: 1930 ఆన్లైన్ ఫిర్యాదు కు : www.cybercrime.gov.in మీ దగ్గర పోలీస్ స్టేషన్ లేదా సైబర్ ల్యాబ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయండి .
జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి
ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలని , డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని మీ భద్రత మీ చేతిలోనే ఉంటుందని ఎలాంటి అనుమానాస్పద లింకులు వచ్చినా క్లిక్ చేయకుండా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ ల్యాబ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ విజ్ఞ ప్తి చేశారు. ప్రజలను డిజిటల్ అరెస్ట్ అని సైబర్ నేరగాళ్ళు మోసాలకు గురి చేయడానికి ప్రయత్నించి నట్లయితే ఆ పరిస్థితులలో ప్రజలు సైబర్ ల్యాబ్ పోలీసులను ఆశ్రయించాలని, ముందు జాగ్రత్త చర్యలతో అటువంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి అవగాహన పొందాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.

