21న కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
1 min read

అర్జీలను “meekosam.ap.gov.in” వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చు
అర్జీల పరిష్కార సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల,న్యూస్ నేడు: ఈ నెల 21న సోమవారం ఉదయం 9-30 గంటలకు నంద్యాల జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్ కు వచ్చే అవసరం లేకుండా “meekosam.ap.gov.in” లో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చునన్నారు. దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో ప్రస్తుత సమాచారం ఆన్లైన్లో తెలుస్తుందని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100 ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత మండల, డివిజన్, మున్సిపాలిటీలలో అధికారులకు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. మండల, డివిజన్ స్థాయిలలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాగలరని తెలిపారు. ఉదయం 9-30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

