చైతన్య అనాధ ఆశ్రమం భవన నిర్మాణానికి దాతలు సహాయం చేయండి
1 min read
చైతన్య సేవా సంస్థ విజ్ఞప్తి
మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిది : మదనపల్లె పట్టణం బికే పల్లి వైయస్సార్ కాలనీలో చైతన్య సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాధ ఆశ్రమం, ఆనంద వృద్దా శ్రమం భవన నిర్మాణ పనులు పురోగతిలో కొన సాగుతున్నాయి. ఈ భవన నిర్మాణా నికి దాతలు మాన వత్వంతో ముందు కు వచ్చి నిర్మాణ పనులు పూర్తి చేయ డానికి అవసరమైన సహాయ సహకారా లు అందించి, చైతన్య సేవా సంస్థ కు అండగా నిల వాలని వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్, సంస్థ జనరల్ సెక్రటరీ కవితా రాణి, డైరెక్టర్ ఆనంద కృష్ణ చరణ్, సంస్థ అడ్మిన్ డైరెక్టర్ జీవీఏస్ బాబు లు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో ఆనంద వృద్ధాశ్రమం మరియు ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల కొనసా గించడం ఆర్థిక సమస్యలతో కూడు కున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యం లో ప్రభుత్వం కేటా యించిన స్థలంలో సొంత భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరి గిందని, ఇందులో భాగంగా ఇప్పటికే ఆరుగదులు నిర్మాణంలో గోడలు పురోగతిలో ఉన్నా యని, వీటికి పై కప్పు రేకులు లేదా మౌల్డింగ్ మరియు ప్లాస్టింగ్ మౌలిక వసతులు కల్పన కు మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి వస్తు రూపేనా సహాయ సహ కారాలు అందించి పనులను పూర్తి చేయడానికి తమ వంతు తోడ్పాటు ను అందించాలని కోరుతున్నారు. ఎవరైనా దాతలు వారి కుటుంబ సభ్యులు పేరుమీద ఒక గది పనులు కు సహయం అందిస్తే ఆ గదికి వారి పేరు నే ఏర్పాటు చేయడం జరుగు తుందని స్పష్టం చేశారు. కావున దాతలు ముందుకు వచ్చి రూములు పూర్తి చేసుకోవ టానికి అవసరమైన రేకులు, ప్లాస్టిగ్ కు అవసరమైన ముడి సరుకులు అందించి, చైతన్య సేవా సంస్థ నిర్వ హిస్తున్న వృద్ధా శ్రమము, ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు తోడ్పాటు అందించి అండగా నిలవాలని కోరుతున్నారు. ఇందుకు దాతలు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, అకౌంట్ హోల్డర్ చైతన్య సర్వీస్ సొసైటీ అకౌంట్ నెంబర్ – 31553460730,ఐ ఎఫ్ ఎస్ సి – ఎస్బీఐఏన్ 0000868, మదనపల్లె బ్రాంచ్ బ్యాంకు ఖాతా కు తమ వంతు చేయూత ను అందించాలని కోరుతున్నారు.



