NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రామాయణం మానవ మనుగడకు దిక్సూచి

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.

చిన్న గుమ్మడాపురం నందు ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  శ్రీమద్రామాయణం మానవజాతి మనుగడకు దిక్సూచి అని ప్రతి వ్యక్తి శ్రీమద్రామాయణంలోని ఆదర్శాన్ని తెలుసుకుని పాటించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలం, చిన్నగుమ్మడాపురం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా మొదటిరోజు ప్రవచనంలో భాగంగా స్వాత్మానందస్వామి శ్రీమద్రామాయణ విశిష్టతను గురించి వివరించారు. తదనంతరం స్థానిక భజన మండలిచే నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను ఎంతగానో అలరించినది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సాంబశివుడు, రాముడు, చిన్నరాజు, శేఖర్, మౌళాలి, శివన్న,లక్ష్మీదేవి, శ్రీలత, ఉమాదేవి, లక్ష్మిదేవి, విజయలక్ష్మి, నాగమ్మ, సరోజ, రామతులశమ్మ, రామలక్ష్మి, రమణమ్మ, రామతులశమ్మ,  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *