NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహేశ్వరికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు!

1 min read

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బోయ క్రాంతి నాయుడు

పత్తికొండ, న్యూస్​ నేడు: మహేశ్వరికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు న్యాయవాది బోయ క్రాంతి నాయుడు తెలియజేశారు. కట్నం వేధింపుల కారణంగా వివాహమైన ఆరు నెలల్లోపే మహేశ్వరి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఎంతో ప్రేమతో పెంచి, ఎన్నో ఆశలతో పెళ్లి చేసిన తల్లిదండ్రులకు ఇది తీరని విషాదం. మహేశ్వరికి న్యాయం చేయాలని పోరాడుతున్న విద్యార్థులు, బాధిత కుటుంబ సభ్యులకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. కుటుంబ సభ్యులకు ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా అందని పరిస్థితిని గుర్తించి, నేను ఆర్డీవో, డీఎస్పీ, జాయింట్ కలెక్టర్ లతో మాట్లాడి ఎఫ్‌ఐఆర్ కాపీ అందేలా చర్యలు తీసుకున్నాను. పోలీసు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి నిందితుల అరెస్టుకు కూడా కృషి చేయడం జరిగింది. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్  ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులకు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని క్రాంతి నాయుడు  కోరడమైనది. మహేశ్వరికి న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటూ మా పోరాటం కొనసాగిస్తామని క్రాంతి నాయుడు  తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *