NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదల సంక్షేమానికి పెద్దపీట,12 కుటుంబాలకు అంత్యోదయ రేషన్‌ కార్డుల పంపిణీ

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ పేదల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి అన్నారు. మంగళవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన 12 అంత్యోదయ అన్నయోజన రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.                          ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఒక్కో కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యం అందుతాయని, రానున్న రెండున్నరేళ్లలో పేదలకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *