NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించటమే ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ కార్యక్రమం

1 min read

అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించుటయే ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ కార్యక్రమం(పియంయంవైఎ ) ముఖ్య ఉద్దేశ్యమని ఆమదాల అప్పలస్వామి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్: మౌనిక మరియు అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు సూచించారు. స్థానిక ఏలూరు పట్టణ ఆరోగ్య కేంద్రం ఎ ఎస్ ఎస్ కాలనీ సందర్శించి అక్కడ ఉన్న గర్భిణి స్త్రీలతో గోవిందరావు మాట్లాడుతూ గర్భధారణ గొప్ప వరమని ప్రతి గర్భిణీ స్త్రీ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ గర్భస్థ శిశువు ఎదుగుదలకు తగు పౌష్టికాహారము, వైద్యుల సలహాలు, వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఈ పరీక్షాన్ని ఉచితంగా ఈ పి ఎం ఎస్ ఎం ఎ కార్యక్రమంలో లభిస్తాయని, ప్రతి గర్భిణీ స్త్రీ ప్రతిరోజు మంచి పౌష్టికాహారం, తాజా పండ్లు, ఆకుకూరలు, రాగి జావా లేక రాగి సంకటి, వేరుశనగ ఉండలు, అంగన్వాడి  కేంద్రంలో సప్లై చేసినటువంటి  గుడ్లు పాలు, చిక్కీలు తప్పనిసరిగా తినాలని ప్రతి నెల వైద్యులుసే బీపీ షుగరు బరువు, రక్త పరీక్షలు చేయించుకోవాలని తగిన విశ్రాంతి తగిన వ్యాయామం చేయాలని కాన్పుకు రెండు నెలల ముందే ఏ ఆసుపత్రుల్లో పూడిపించుకోవాలో ముందుగా నిర్ణయించుకోవాలని కాన్పు సమూల అక్కడికే వెళ్లి కాన్పు చేయించుకొని సూచించారు వీలైనంతవరకు ప్రభుత్వ ఆసుపత్రులు కాన్పు చేయించుకోవడం నా అనేక ప్రభుత్వ పథకాలు  జె ఎస్ ఎస్ కె, జె ఎస్ వై , తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ద్వారా కాన్పు జరిగిన తర్వాత   తల్లిని బిడ్డను ఉచితంగా  ఇంటికి చేర్చడం జరుగుతుందని, అలాగే గర్భిణీ స్త్రీలు కరపదాన సమయంలో జ్వరాలు బారిన పడకుండా, దోమ పట్ల అప్రమత్తంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రతల భాగంగా ఇంటి పరీసరాలులో  నీరు నిలవ లేకుండా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెన్స్ శ్రీనివాసరావు, రమేష్ బాబు  ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *