NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు

1 min read

400లీటర్లు ఊట మరియు 10 లీటర్లు నాటుసారా  ధ్వంసం

పత్రికా విలేకరులకు నమస్కారం.

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నాటుసారా తయారీ, విక్రయాలు మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వారి ఆదేశాల మేరకు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు కర్నూలు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మునగాలపాడు, బంగారుపేట మరియు పస్పుల గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించడం జరిగింది.ఈ దాడుల్లో బంగారుపేట గ్రామంలో సుమారు 200 లీటర్ల బెల్లం ఊట (నాటుసారా తయారీకి ఉపయోగించే పులియబెట్టిన బెల్లం ద్రావణం) మరియు 5 లీటర్ల నాటుసారాను గుర్తించి, బెల్లం ఊటను సంఘటనా స్థలంలోనే ధ్వంసం చేయడం జరిగింది.అదేవిధంగా మునగాలపాడు గ్రామంలో సుమారు 100 లీటర్ల బెల్లం ఊట మరియు 5 లీటర్ల నాటుసారాను,పసుపల గ్రామంలో సుమారు 100 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేయడం జరిగింది.ఈ మూడు ప్రాంతాల్లో నాటుసారా తయారీకి పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.నాటుసారా తయారీ, విక్రయాలు మరియు అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.ఈ దాడుల్లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అసిస్టెంట్  సూపరింటెండెంట్ (AES) రాజశేఖర్ గౌడ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ చంద్రహాస్, ESTF CI రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐలు, ట్రైనీ ఎస్‌ఐలు మరియు STF సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *