ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో సిబ్బందికి పదోన్నతులు
1 min read

6గురి కి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు అందిస్తున్న మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 6గురికి పదోన్నతులు కల్పిస్తూ నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.హెల్త్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న శనపతి.అప్పారావు,బోను.రాజు ఇద్దరికీ శానిటరీ ఇన్స్పెక్టర్లుగా.బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్న టి.సునీల్, ఎస్.కె బాజీ.రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న టిఎన్ భూపాల్.ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ గా పని చేస్తున్న ఎస్.కె నజీర్ లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ మేయర్ నూర్జహాన్ పెదబాబు ఉత్తర్వులు అందించారు.శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గ ఆదేశాలతో నగరపాలక సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీ అయిన స్థానాల్లో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రజలకు మంచి సేవలు అందించి పాలకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని మేయర్ నూర్జహాన్ పెదబాబు కోరారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ ఏ.భాను ప్రతాప్ అదనపు కమిషనర్ జి.చంద్రయ్య,మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

