NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వికలాంగుల పింఛన్లు పునరుద్ధరించకపోతే ఆందోళన

1 min read

వికలాంగుల పింఛన్లు తొలగించడం దారుణం..

ఓర్వకల్లు , న్యూస్​ నేడు : వికలాంగుల పింఛన్లు తొలగించడం సరైన దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాఓర్వకల్లు ఎంపీడీవో కార్యాలయం ముందు వికలాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. తర్వాత కార్యాలయ పరిపాలన అధికారి వెంకట రామయ్యకు వికలాంగులు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నాగన్న మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్లకు అనర్హులని గ్రామ పంచాయతీ అధికారులు వికలాంగుల ఇండ్ల వద్దకు వెళ్లి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాల నుండి పింఛన్లు వస్తున్న వికలాంగులకు కూడా నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.ప్రతి ఒక్కరికీ గతంలో సదరం సర్టిఫికెట్లను డాక్టర్లు ఇచ్చారని వాటి ద్వారానే పింఛన్లు వస్తూ ఉన్న వాటిని తీసివేయడం రీ వెరిఫికేషన్ పేరుతో పింఛన్ల తొలగింపు అన్యాయమని ప్రభుత్వం మారితే లేదా డాక్టర్ మారితే వికలాంగుల శాతం తగ్గుతోందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నోటీసులు ఇచ్చిన వికలాంగులందరికీ పింఛన్లు తీసివేయకుండా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో వికలాంగులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మహబూబ్ బాష,మద్దిలేటి,నాగన్న మరియు వివిధ గ్రామాల వికలాంగులు పాల్గొన్నారు.

About Author